Saturday, October 5, 2013

శేఖర్ కపూర్ "మాసూమ్" దర్శకత్వ అనుభవాలు !

దేశ విభజనకు ముందు శేఖర్ లాహోర్ లో పుట్టాడు, తండ్రి డాక్టర్ k.v.కపూర్. శేఖర్ జీవితం లో చూసిన  మొట్ట మొదటి  సినిమా "ఉడన్ ఖటోలా". అంటే flying saucer అని అర్ధం. చిన్నతనం లో శేఖర్ టార్జాన్ సినిమాలంటే చెవి కోసుకునేవాడు, బాలివుడ్ సినిమాలు హాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాలు చూసేవాడు. ఆకలి, దాహం మరిచి ఒకొక్కసారి వాతానుకూల సినిమా థియేటర్ లోకి ప్రవేశించాక లోకాన్నే మరిచిపోయి కధలో సంలీనమైపోయేవాడు, మాయా ప్రపంచంలో తెలిపోయేవాడు  ఉద్వేగం తో ఊగిపోయేవాడు.

శేఖర్ చిన్నతనంలో టెలివిజన్ లేదు , ఆటలాడించేవారు కాదు కనుక అతనికి సినిమాలే లోకమయ్యాయి, ప్రముఖ నటుడు దేవానంద్ మేనల్లుడే శేఖర్. ఒకసారి ఒక ప్రమాదంలో దేవ్ పన్ను విరిగిపోతే దేశంలోని ఆయనను అభిమానం చే యువకులు కొందరు తమ పన్ను పీకేయించుకున్నారు, దేవానంద్ లాగా నవ్వటం కోసం! డిల్లీ లో శేఖర్ ఇంటికి దేవ్ వచ్చినప్పుడల్లా రెండు వేలమంది దేవ్ ను  చూడ్డానికి గుమి గూడి  ఎగబడే వారు. సినిమాల్లో ఉండే గ్లామర్ ను శేఖర్ చిన్నప్పుడే తెలుసుకున్నాడు, అందుకే సినీస్టార్ కావాలని కలలు కన్నాడు .

సినిమా కలలు కంటున్న శేఖర్  భవిష్యత్తు పై భయపడి అతని తల్లిదండ్రులు అరవైలలో ముంబాయి నుంచి దూరంగా ఉంచడానికి లండన్ పంపించారు, అక్కడ విద్యార్ధుల వసతిగృహంలో శేఖర్ నివసించేవాడు. ఛార్టడ్ అకౌంటెంట్ అయ్యాడు, బర్మా ఆయిల్ కంపెనీకి ఒక సంవత్సరం, ఆనక 3,4 సం|| లు  చిన్న చిన్న కంపెనీలకు  పనిచేసి డబ్బు బాగా కళ్ళజూడడం మొదలెట్టాడు.లండన్ లో పని చేస్తూనే సినిమాలు తెగచూసే వాడు, సినిమా దర్శకుడుగా తనను తాను ఊహించుకొని లోతుగా సినిమాలను అధ్యయనం చేసేవాడు. లండన్ ఫిల్మ్ స్కూల్ లో చేరాలని పోతే వారొక సినిమా స్క్రిప్టు రాసి తీసుకురమ్మన్నారు, శేఖర్ ఒక పాత టైప్ రైటర్ కొని స్క్రిప్టు రచనలో ఉత్సాహంగా లీనమైపోయాడు ఆరేడేళ్ళ కుర్రాడు తన పడక గదిలో నుంచి తల్లిదండ్రుల కొట్లాటలు, సూటీ పోటీ మాటల యుధ్ధాలు విని విని క్షణ క్షణం భయపడే 15 నిమిషాల చిన్న సినిమా స్క్రిప్టు రాసుకున్నాడు.

ఆ సమయంలోనే శేఖర్ అంకుల్ దేవానంద్ ప్రముఖ నటి అయిన తన గర్ల్ ఫ్రెండ్ తో కలసి లండన్ వచ్చాడు. ఇండియాకు తిరిగివస్తే పెద్ద స్టార్ ను చేస్తానని ఆశ పెట్టాడు. శేఖర్ ఆ హీరోయిన్ ను లోలోపల ప్రేమించేయడం మొదలు పెట్టాడు. తన స్పొర్ట్స్ కార్, స్టీరియో సిస్టమ్, దుస్తులు అన్నీ వదిలేసుకొని ఇండియాకు వచ్చేశాడు.

డిల్లీ లోని తల్లిదండ్రుల వద్దకు చేరుకోగానే వాళ్ళు చీవాట్లు పెట్టారు, అంత ఆదాయాన్నీ, స్వంత అపార్ట్మెంటు నూ వదలుకొని, సాధించిన విజయాలను తుడిచేసుకొని కొత్త అనూహ్యరంగంలోకి కళ్లుమూసుకొని గుడ్డిగా ప్రవేశించడం వాళ్ళకు ససేమిరా నచ్చలేదు. తన కొడుకు విజయాలను అందరికీ చెప్పుకొని ఆనందిస్తున్న వాళ్ళు అమాంతం నీళ్ళుకారిపోయారు. అయినా తేరుకొని అత్యంత ధనికులైన అమ్మాయిలను శేఖర్ కు పరిచయం చేసి కుదిరితే పెళ్ళి చేస్తే నయినా కుదురుగా పడి ఉంటాడని భావించారు. చాలా గొప్ప గొప్ప సంబంధాలయితే వచ్చాయి కాని శేఖర్ తాను ముంబాయి లో సినిమా నటుడిగా ప్రయత్నిస్తానని, మళ్ళీ లండన్ వెళ్ళనని  చెప్పేశాడు, వాళ్ళు ఇష్టపడలేదు ఇంకేముంది ముంబాయికి చెక్కేశాడు. 

కాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎవ్వరూ శేఖర్ ను తీసుకోలేదు. కారణం, అనర్ఘళముగా ఆంగ్లంలో మాట్లాడ గలగడం, దేవానంద్ మేనల్లుడు కావడం. అతన్ని గట్టిగా కోప్పడలేక , చిన్నా చితకా పనులు చెప్పలేక , క్వీన్స్ ఇంగ్లిష్ మాట్లాడేవాడిని మనమేం చేసుకుంటామని ఎవ్వరూ పని ఇవ్వలేదు.

ఇక ఇలాకాదని తాను హీరోగా 'టూటే ఖిలోనా' అనే సినిమా షబానా అజ్మి ని హీరోయిన్ గా తీసుకొని నిర్మించాడు. మంచి నటన కనబరిచారిద్దరూ, కాని సినిమా పెద్దగా ఆడినట్లు లేదు. తన సహజ నటనతో టీవీలో శేఖర్ ఒక కొత్త శైలిని ప్రవేశ పెట్టాడని చెప్పవచ్చు. అది విజయవంతమైంది కూడా. గ్రామ గ్రామానికి టీవీ వ్యాపించి నటీ నటులు ప్రజలకు , సన్నిహితులైపోయారు.

దేవానంద్ ఎవరెస్ట్ మొగలో  షూట్ చేసిన ఇష్క్ ఇష్క్ ఇష్క్ లో  ఒక పాత్ర ను నటుడిగా శేఖర్ కు ఇచ్చాడు  , శేఖర్ అయిదు నిమిషాలు తెరమీద కనిపించాడు, ఆ సినిమా నాలుగైదు రోజులు మాత్రమే ఆడింది !.
సెక్సీ స్పొర్ట్స్ కార్ లో లండన్ వీధుల్లో గర్ల్ ఫ్రెండ్స్ తో హాయిగా తిరిగిన శేఖర్ ముంబాయి లోకల్ రైళ్ళలో తిరిగాడు, ట్యాక్సీని ఐన ఎంగేజ్  చేసుకునే ఆర్ధిక శక్తి శేఖర్ కు లేకుండా పోయింది. అయినా అతను నిరాశపడకుండా తనకు ఇష్టమైన సినిమా రంగంలో కష్టాలను కూడా అవలీలగా తట్టుకొని రాటు తేలాడు . 

అలా నటుడిగా పదేళ్ళు గడిపాక కాని శేఖర్ కు సినిమా దర్శకత్వ అవకాశం లభించలేదు. అదే  'మాసూమ్' సినిమా.  నిర్మాత  దేవిదత్.  అతను అంతకుముందే నసీరుద్దీన్ షా తో 'ఆక్రోష్' అనే సినిమా , గోవింద్ నిహ్లాని దర్శకత్వంలో నిర్మించి ఉన్నాడు.  దానికి డిస్ట్రిబ్యూటర్ ను శేఖర్ కుదిర్చాడు. ఆ కృతజ్ఞత తోనే శేఖర్ కు ఆ అవకాశం లభించింది. శేఖర్ శ్రేయోభిలాషి ఐన షబానా ఆజ్మీ ప్రధాన పాత్ర లో నటించడానికి అంగీకరించింది. ఆమె చాలా తక్కువ పారితోషికానికే ఒప్పుకుంది. రాహుల్ దేవ్ బర్మన్ సంగీతన్నీ, గుల్జార్ సాహిత్యాన్నీఅందించారు. అయితే ఎవరికీ పూర్తి పారితోషికం నిర్మాత దేవిదత్ చెల్లించలేదు, అయినా వారు శేఖర్ కోసం ఆ సినిమా చేశారు, ఆ సినిమా మొత్తం బద్గెట్ 25 వేల డాలర్లు.

శేఖర్ చెప్పే సినిమా కధల బోరు వినలేక ఆయన కనపడితే దూరం పారిపోయేవారు, ఆయన పార్టీలకు వెళితే చాలు మిత్రులు "బాబోయ్ శేఖర్ వస్తున్నాడు కధలు చెప్పి చావగొడతాడు పదండి పదండి పరుగెత్తుదాం"అని. అప్పుడు షబానా ఆజ్మీదర్శకత్వం చేయమని సలహా ఇచ్చింది. శేఖర్ అలా దర్శకత్వం రంగం లోకి ప్రయత్నించి ప్రవేశించాడు.

శేఖర్ కు నాటకీయత ఇష్టం, గుల్జార్ కు కవితాత్మకత ఇష్టం. మొదట శేఖర్ గుల్జార్ కు  మాసూమ్ స్క్రీన్ ప్లే చూపిస్తే ఇది బైబిల్ లా ఉంది స్క్రీన్ ప్లే లా లేదు, ఇది పూర్తిగా తీస్తే ఎన్ని గంటల సినిమా అవుతుందో నీకేమైనా తెలుసా? అన్నాడు. అప్పుడు ఇద్దరూ  కూర్చొని దానిని ఉమ్మడిగా ఎడిట్ చేశారు, అయితే దానిలో చాలా వరకు శేఖర్ దే తుది నిర్ణయం, శేఖర్ అనుకున్నదే దానిలో రాశారు,గుల్జార్ శైలి లో కవితాత్మకంగా కాక, శేఖర్ అనుకున్నట్లు నాటకీయంగా రాసుకున్నారు. శేఖర్ మెలోడ్రామా సందర్భాలను సృజించుకొన్నాడు. మధ్య తరగతి  కుటుంబంలో జరిగిన కధ.  మాసూమ్ అనగా అమాయకుడు innocent అని అర్దం.  ఇద్దరు ఆడపిల్లలేకానీ మగపిల్లలు లేని ఆ కుటుంబంలోకి  చిరుకిరణంలా ఒక పసివాడు ప్రవేశిస్తాడు. ఒక మోసం ఫలితం ఆ చిరుమొలక ఆ పసివాడు ఎవడు అనేది ఆనక వెండి తెరపై చూడండి.........క్షమించాలి బుల్లి తెరపై చూడండి.

మాసూమ్ గ్రామీణ నేపధ్యం లో తీసే శ్యామ్ బెనెగల్, ప్రేమ, కుటుంభం, నేపధ్యంలో తీసే యష్ చోప్రా, ఇద్దరికీ మధ్యలో ఉండేటట్లు శేఖర్ మాసూమ్ తీసాడు. రొమాన్స్ లేకుండా విలన్ లేకుండా విబిన్నంగా తీసాడు. కథ లో ఎవరి తప్పూ ఉండదు.కథలో సంఘర్షణ ఉనప్పటికీ అది బాలీవుడ్ తరహా సంఘర్షణ కాదు, అది నీతి బోధ చేయదు . అది అలా జరిగిపోతుంది అంతే! పిల్లడు  పిల్లడిలాగే  అమాయకంగా మాట్లాడుతాడు కానీ పెద్ద పెద్ద పెద్దల మాటలు, నాపసాని ఆరిందా మాటలు మాట్లాడదు.

ఆ సినిమా కుటుంబం కోసం వంద ఇండ్లు చూసి మూడు ఇండ్లు ఎంపిక చేశాడు శేఖర్. ఒకింటి వెనక గార్డెన్ లో , మరొక ఇంటి ఇంటీరియర్ లో , ఇంకొక ఇంటి ముందటి గార్డెన్ లో షూట్ చేసి మూడిళ్ళలో తీసి ఒక ఇల్లుగా బ్రమింప చేసాడు శేఖర్.

రైల్వే స్టేషన్ లో షూట్ చేసేటప్పుడు కెమెరా కనపడకుండా దాచి దొంగతనంగా తీయవలసి వచ్చింది, సమయం లేక అధికారుల పూర్వానుమతి తీసుకోక పోవడం వల్ల! రైలు వచ్చినప్పుడు షూట్ చేసారు. శేఖర్ చాలా Instinctive దర్శకుడు, చిన్నపిల్లలను జాగ్రత్తగా ఎంపిక చేసాడు.  రాహుల్ గా వేసిన కుర్రాడు అంతకు ముందే ఒక కమర్షియల్ సినిమాలో నటించి కొంత అనుభవం సంపాదించాడు. అతని తల్లి తండ్రుల అనుమతి అడిగితే కుర్రాడిష్టం అన్నారు.  కుర్రాడు నేను చెయ్యను పొమ్మన్నాడు! రికార్డింగ్ ధియేటర్ కు  ఆ బాబును తీసుకెళ్ళి పాట రికార్డింగ్ చూపించి బుజ్జగించి నచ్చచెబితే ఒప్పుకున్నాడు కానీ ఆ అబ్బాయి స్త్రీ ద్వేషి , అమ్మాయిలెవరూ తనను ముట్టుకోకూడదని  ముందే ఆంక్ష పెట్టాడు.

షబానా ఆజ్మీ తనను ముట్టుకోవడానికి ఆ కుర్రాడు ఒప్పుకోలేదు, ఇద్దరు అమ్మాయిలు తనను స్పర్శించకూడదన్నాడు. తప్పని సరి అయినప్పుడు  శేఖర్ రెహార్సల్ లో టచ్ చేయకుండా తీసి అసలు షూటింగ్ లో ముట్టుకోమన్నాడు వాళ్ళను, ఒకసారి తనను కౌగిలించుకున్న అమ్మాయి ముఖం మీద ఈడ్చి ఒక చెంప దెబ్బ కొట్టాడు! శేఖర్ ఆ పిల్లల మాటలను సెట్ లోనే తిరగరాసాడు  సహజంగా   వారు ఎలా చెప్పగలరో అలా రాసాడు, మార్పులు చెపులు చేసాడు కొంచెం పెద్ద పాప గా ఉన్న ఊర్మిళ మాటోండ్కర్ కు అప్పటికే కొన్ని సినిమాల అనుభవం ఉంది. ఊర్మిళ ఆ తరువాత పెద్ద స్టార్ అయింది. మిన్నీగా వేసిన పాప బీద కుటుంబం నుంచి వచ్చింది. షూటింగ్ ప్రారంభించినప్పుడు పిల్ల లాగా ఉన్న పిల్ల స్టూడియో తిండి తిని పుష్టిగా చబ్బీగా తయారయింది. పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా కాళ్ళు చేతులు కడుపుతున్నారో చూసి అలాగే రచించి, వాళ్ళను సహజంగా రూపకల్పన చేసాడు. పిల్లలాట లాగే వారితో ఆడుతూ పాడుతూ శేఖర్ షూటింగ్ చేసాడు. అప్పటికప్పుడు స్వఛ్చందంగా మార్పులు చేర్పులు చేసి షాట్లు తీసాడు.

టెక్నిక్ గూర్చి ఆలోచించకుండా స్వఛ్చంగా సహజంగా తీసాడు శేఖర్, క్లోసప్ లు తక్కువగా తీసాడు, మిడ్ షాట్, క్లోసప్, వైడ్ షాట్స్ గా శేఖర్ సినిమాను ముందుగా రూపొందించుకోలేదు. శేఖర్ షూటింగ్ నిష్పత్తి 3 to 1. ఫైనల్ కట్ లో వాస్తవంగా అవసరమైన నెగటివ్ కంటే 3 రేట్లు మాత్రమే తీసాడు. అంటే చిన్న విషయాలలో తప్ప కటింగ్ చేయడానికి ఎడిటర్ కు తక్కువ అవకాశం ఇచ్చాడు.  నెగటివ్ వేస్ట్ చేయకుండా చాలా పొదుపుగా కథ ను తన అదుపులో పెట్టుకొని శేఖర్ మాసూమ్ తీశాడు , రాస్తూ షూట్ చేశాడు, షూట్ చేస్తూ రాశాడు. అదొక అతి తక్కువ బడ్జెట్ సినిమా.

నిర్మాత గుట్టలు కొండలు ఎక్కవద్దని, ఎక్కితే పడిపోతారని వారించడం వల్ల, అతను నిద్ర పొయ్యాక  అతనికి తెలియకుండా మిగితా వారిని లేపి, తనకు కావల్సిన విధంగా షూట్ చేశాడు, నిర్మాత నిద్ర లేవకముందే పూర్తి చేశాడు!

స్క్రిప్టును తెరమీదికి ప్రవహింపజేసి అనువదించాడు. తను సొంతం చేసుకోనిది ఇతరులు రాసిన స్క్రిప్ట్ ను తీయడం కష్టం కనుక తన Subconscious mind చెప్పినట్లు తీశాడు, దృశ్యాలతో కథ చెప్పాడు, పాత్రల జీవితాలను చిత్రీకరించాడు, తన స్వేయ జీవితానుభవాలను కథ తో రంగరించాడు, తాను విశ్వాన్ని ఏ విధంగా అర్దం చేసుకున్నాడో అలా తీశాడు. వివిద విభిన్న వ్యక్తులకు నచ్చేలా సంగీతాన్ని, దృశ్యాలను మేళవించి ఎంతో అర్దవంతంగా, ఆలోచనా స్ఫోరకంగా తీసాడు శేఖర్. ఒక దృశ్యం పది మండి ప్రేక్షకులకు పది రకాలుగా కనిపిస్తుంది.

మాసూమ్ ను శేఖరే ఎడిట్ చేసుకున్నాడు, తన మిత్రులైన మంచి ఎడిటర్లను కూడకట్టుకొని 3 to 1 మాత్రమే తీసినప్పుడు ఎక్కువ ఆప్షన్స్ లేనప్పుడు ఎక్కువ నాణ్యత తో ఎడిట్ చేసుకోవాలి, తాను షూట్ చేసిన ప్రతీ షాట్ ను సినిమా లో పెట్టాడు ఆరంభంలో, అంతం లో తీసినవి కొన్ని క్లోసప్ లు వాడుకోలేదు, సీన్ లలోని కొన్ని బిట్స్ ను వాడలేదు.

ఆనవాయితీగ మాసూమ్ ఒక శుక్రవారం నాడు ధియేటర్లలో విడుదలయింది. మొదటి రోజు ఒక ధియేటర్లో ఐదుగురు మాత్రమే వచ్చారు, శనివారం ఒక్కడూ రాలేదు, ఆదివారమూ అంతే!

కారణాలు పరిశీలిస్తే శేఖర్ advertisement విధానం తప్పని తేలింది. పోస్టర్ల మీద పిల్లవాడి ముఖం వేసి ముందొక barbedwire వేస్తే ఎవరు చూడవస్తారు! సోమవారం చూసి రెండు హాళ్లలో తప్ప సినిమాను ఎత్తేశారు కానీ గురువారం నుంచి ఎందుకో చెప్పలేము కానీ టికెట్లు బాగా అమ్ముడుపోయి, ఎత్తేసిన ధియేటర్ వాళ్ళు కూడా మళ్ళీ దానిని వేశారు. అన్నీ చోట్ల మొదటి వారం ఆడలేదు కాని రెండో శుక్రవారం నుంచి టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.

ఇన్నేళ్ల తరువాత ఇప్పటికీ శేఖర్ కపూర్ గొప్ప సినిమా, స్వఛ్చమైన అమాయక సినిమా మాసూమ్ అంటారు. కేబుల్, శాటిలైట్, తెలివిజన్ లలో అత్యధికంగా చూడబడిన సినిమాలలో మసూమ్ కూడా ఒకటి. సెఖ్ర్ నిరంతరం కొత్తగా ఆలోచించి, బాక్స్ ఆఫీస్ దృష్టి లేకుండా, పనులు చేయాలని అభిలషించేవాడని మాసూమ్ చెప్పక చెబుతుంది.  సినిమాకు సరికొత్త వ్యాకరణం రాశాడు, సినిమాలో దర్శకుడు చెప్పేది ఎంత ముఖ్యమో చెప్పకుండా ప్రేక్షకుల ఊహకు వదిలేసేది అంతా ముఖ్యమైనదే అని శేఖర్ అభిప్రాయం. Instinct చెప్పినట్లు  చేయాలని, యెదకు హత్తుకునే దీర్గ కవనంలా ఉండాలని ఆయన ఆలోచన.

శేఖర్ స్క్రిప్టు రాసుకుంటున్నప్పుడే దర్శకత్వ ప్రణాళిక మేధస్సులో రూపొందుతుంది సినిమా ఒక దృశ్య కావ్యమని  శేఖర్ ఎన్నటికీ మరవడు. సినిమా కధను తన కళ్ల ముందు దృశ్యాలు దృశ్యాలుగా చూస్తూ శేఖర్ స్క్రిప్టు రాసుకుంటాడు, ఎలా తీయాలో అతని మెదడులో నిక్షిప్తమై ఉంటుంది, అయితే కంట్రోలర్ గా అధికారం చెలాయించకుండా ఒక facilitator గా ఉండటానికే అతను ఇష్టపడతాడు.

సినిమాలు తీయకముందు శేఖర్ కపూర్ విభిన్న ప్రదేశాలకు వెళ్ళి వారి వారి సంస్కృతులను పరిశీలించాడు, ఇతర దేశాల సంస్కృతులను అధ్యయనం చేయడం ద్వారా భారతీయ సంస్కృతి గొప్ప తనాన్ని తెలుసుకుని తనను తాను పునరావిష్కరించుకున్నాడు

టెక్నిక్ ను Instinct ను సమపాళ్లలో మిళాయించిన దర్శకుడు శేఖర్ కపూర్.

సంచలనాల సినీతార మార్లిన్ మన్రో

హాలీవుడ్ లో 1982 లో మార్లిన్ మన్రో కలిగించినంత సంచలనం మరే తారామణీ కలిగించలేదు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మార్లిన్ పేరెత్తితే చాలు వెర్రెత్తిపోయేవారు. ఆమె  పదేళ్ళలో పదకొండు సినిమాలలో మాత్రమే నటించింది. ఆమె మూర్తిమత్వంలో సినిమాలు ఒక పార్శ్వం మాత్రమే. ఆమె సంపూర్ణంగా అణువణువునా, అడుగడుగునా ఒక సెలిబ్రిటీ. మార్లిన్ సూదంటి రాయి ఆకర్షణ. ఒక సినిమాకు ఇంకొక సినిమాకు మధ్యన ఎంతో వ్యవధి తీసుకున్నా ఆమెను ఎవరూ ఎంత మాత్రమూ మరిచిపోలేరు.
1950 లో ఆమె సినీ వినీలాకాశంలో తారాజువ్వలా దూసుకుపోవడం ఒక సాంస్కృతిక సంబరం. న్యూయార్క్ వార్తా పత్రికల్లో ఆ రోజుల్లో ఆమె ఫోటో, రచన, గుసగుసలు, ముఖాముఖి లేకుండా ఉండేవి కావు, అత్యుత్స్తాహంగా ప్రజలు గుమ్మెత్తిపోయారు. ఆమె ఒక విజయవంతమైన మహిళ.
                               
సెక్సీ తారగా తరంగాలు సృష్టించిన ఆమెలో శిశు సహజమైన అమాయకత్వం దోబూచులాడేది. తనతల్లి దుస్తులను సింగారించుకుని కులుకుతున్న ఒక చిన్నారి పాపలా కనిపించేది. ఆమెను అందరూ ప్రజల ఆస్తిలా భావించేవారు. ఒకే పురుషున్నుండి సంపూర్ణ ఆనందాన్ని అనుభవించడం ఆమెవల్ల సాధ్యపడేది కాదు.

ఆమె వెండి తెరను విద్యుదీకరించింది. ఆమె ఒక విద్యుల్లత మెరుపుతీగ, ఆమె ఒక రంగురంగుల ఇంద్రధనస్సు. కళ్ళకు కనిపిస్తే చాలు పెద్దా చిన్నా అందరూ ఆమె పేరును తిరుమంత్రంగా ఉత్స్తాహంతో పలవరించేవారు. ఆమె తెర మీద కనిపించినా వ్యక్తిగతంగా కనిపించినా మార్లిన్ ను తప్ప మరే ఇతరులను అసలు పట్టించుకునే వారు కాదు, అదే ఆమెకు ప్రజలు బహూకరించిన  అపురూపమైన కానుక, ప్రత్యేకమైన బహుమతి, అనితర సాధ్యమైన గుర్తింపు.
ఆమె ప్రేమ ఛాయాగ్రాహిని తో అత్యధిక ఛాయా చిత్రాలు తీయబడిన నటిగా చెప్పుకోవచ్చు. ఛాయా గ్రాహకులు ఎల్లవేళలా క్లిక్కు మనిపించి ఆమె ప్రతిబింబాన్ని పొందుపరచడానికి నిరంతరం ఉత్సుకత చూపించేవారు. మార్లిన్ మన్రో ఆనాటి ప్రపంచ ప్రజల కలల రాణి, విశ్వ వ్యాప్తి పొందిన తెర  గారడి. కాలం గడిచిన కొద్దీ ఆమె ప్రతిరూపం ప్రజల కళ్ళల్లో ఎంత మాత్రమూ మాసిపోలేదు, కనుమరుగు కాలేదు. ఇన్నేల్లైనా ఇంకా ఇప్పటికీ జనుల గుండెల్లో ఆమె ఊపిరితీస్తూనే ఉంది . ఆమె గురించి రాయడమంటే అందమైన సీతాకోక చిలుకను గుప్పెట్లో బంధించాలని వృధాగా వెంటపడటం! ఆయాసం తప్ప మిలమిలలాడే నక్షత్రం చేతికందుతుందా?
ఆనాటి అమెరికా అద్యక్షుడు జాన్.ఎఫ్. కెన్నెడీ  జన్మదినం రోజున మార్లిన్ హ్యాపీ బర్త్ డే  టూ యూ  అని ఎలుగెత్తి  పాడింది. అది ఆనాటి టివీ లలో ప్రస్ఫుటంగా హైలైటుగా నిలిచిన దృశ్యం
ఇంకా పసితనం మాయని లేత గొంతు ఆమె ఆస్తి. ఆమె ముఖంలో అందం  కంటే ఆకర్షణ ఎక్కువ.
మార్లిన్ బాల్యం మధురమైనదేమీ కాదు. ఉన్మాదం,హత్యాయత్నం. శిశు మానభంగం వీటన్నిటితో కూడుకున్నది. ఎవరూ కోరుకోనివి ఈ శిశువు బాల్య స్మృతులు.

మార్లిన్ మన్రో పుట్టినప్పుటి పేరు "నార్మా జీన్ బేకర్". పుట్టిన తేది జూన్ 1, 1926. ఇంకా ఇప్పటికీ ఆమె  బతికి ఉండినట్లయితే 87 సంవత్సరాలు దాటి ఉండేవి. ఆనాటి ప్రముఖ హాలివుడ్ నటి నార్మా తలమడ్గే మీద అభిమానంతో నార్మా అని నామకరణం చేసింది ఆమె  తల్లి గ్లాడిస్ పెర్ల్ మన్రో. నార్మా పుట్టకముందే మూడేళ్ళ క్రితం ఆమె మొదటి భర్త బేకర్ ఆమెకు విడాకులిచ్చేసాడు. ఆమె రెండో భర్త ఎడ్వర్డ్ మోర్టెన్సన్ ఆమె గర్భం దాల్చానని తీపి కబురు చెప్పగానే ఆమెను వదిలేసాడు. మామూలుగా అయితే ఎడ్వర్డ్ మోర్టెన్సన్ నార్మా తండ్రికావాలి కాని  కానేకాడు. అమె తల్లి అప్పుడు ఆర్.కె.ఓ. ఫిల్మ్ స్టూడియో లో పనిచేసేది. అక్కడే పనిచేసే ఆమె సహుద్యోగి ఆమె తండ్రి. కాని ఆయన్ని నార్మా తల్లి పెళ్లి చేసుకొనేలేదు అనగా నార్మా తండ్రి ఎవరో తెలియని పిల్ల అన్నమాట.
గ్లాడిస్ బేకర్ తల్లి తండ్రులు సోదరులు అందరూ మానసిక వైకల్యాన్ని  అనుభవిస్తున్నవారే  నార్మా కూడా హిస్టీరియా వల్ల ఫిట్స్ తో భాధపడేది.
1934 లో ఎనిమదవ ఏట ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్చారు. తల్లి తండ్రులెవరూ బ్రతికిలేనట్లుగా అనాధబాలికలా!

అప్పటినుంచి ఒక చోటనుంచి మరొక చోటుకు నార్మాను మార్చారు. అనాధాశ్రయాలలో 11 మంది దత్తత తీసుకున్న తల్లితండ్రులు మారారు. వారైనా ఎందుకు దత్తత  స్వీకరించారంటే ఆ ఆర్ధికమాంద్యపు  రోజుల్లో ప్రభుత్వం అందుకు ఆర్ధిక సహాయం చేసేది కనుక! అందులో ఒక కుటుంబం  అంతకు ముందు ఆరుగురు స్నానం చేసిన నీళ్ళను వాడి నార్మాకు స్నానం చేయించేది. ఇంకొక కుటుంబం  నెలకు 5 సెంట్లకు బోళ్ళు తోమించి పాచిపని చేయించి ఊడిగం చేయించేది. క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా వారి సొంత పిల్లలకు బహుమతులు ఇచ్చేవారు కాని నార్మాకు  ఇచ్చేవారు కాదు. మిడిగుడ్లు పెట్టుకుని మిటమిటా చూస్తూ ఉండేది! ఒక సారి మాత్రం వారిపిల్ల ఒక నారింజపండు ఇచ్చింది. తానొక్కదాన్ని దానిని ఆనందంగా ఆరగించడం ఆమె ఎప్పుడూ నెమరు వేసుకుని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేది.

ఎనిమిదేళ్ళకు నార్మా ఏపుగా ఎదిగింది. అప్పుడు ఒక పెద్ద మనిషి ఒక ఆట నేర్పిస్తానని మాయమాటలు చెప్పి నార్మాకు మానభంగం చేసాడు.అప్పటి ఆమెను పెంచుకున్న తల్లి తండ్రులకు ఈ విషయం చెప్తే అబద్దాలు చెప్పొద్దని ఆమెనే దండించారు. అప్పటినుంచే నార్మాకు నత్తి సంక్రమించింది.ఆమె శారీరకంగా ఎదుగుతున్నా మానసికంగా క్రుంగిపోయింది. పాలబుగ్గల పసిపాప నుంచి స్త్రీ సహజ మైన రూపురేకలు సంతరించుకుని  నిండు  యవ్వనిగా రూపొందింది. ఆనాటి యువకుల కళ్ళన్నీ ఆమె శరీరం పైనే పురుగుల్లా ప్రాకేవి. ఆమెకూడా నలుగురి దృష్టిని ఆకర్షించాలని స్వతహాగా ప్రయత్నించేది. పదమూడేళ్ళు వచ్చేసరికి ఆమె పరిపూర్ణంగా వికసించింది. చిన్నప్పుడు  లాస్ ఏంజిల్స్ లో నివసించినపుడు పాటశాలలో అబ్బాయి పాత్రలే ధరించేది!
తన పదహారవ ఏడూ గడిచిన తర్వాత నార్మా మళ్ళీ అనాధాశ్రమం నుండి తప్పించుకోవడానికి జేమ్స్ డౌహార్టీ 1942 లో పెళ్ళిచేసుకుంది. ఆతను చాలా ఏళ్ల నుంచి ఆమె పొరుగుననే నివసించేవాడు. జేమ్స్ తరచుగా అనేవాడు అతని భార్య నారా అతన్ని ఆపాదమస్తకం ప్రేమించేదని, మంచిగా వండిపెట్టేదని, అయితే అప్పుడప్పుడూ ఇంటిపనితో విసిగి వేసారి ఆత్మహత్యకు ప్రయత్నించేదని.
 ఏది ఏమైనా నార్మాలో అసహనం ప్రబలుతుండేది. తానూ ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడేది. 1944లో ప్లేన్ parts కర్మాగారం లో ఆమె  ఉద్యోగం చేసింది, జేమ్స్ నార్మాను స్వేటర్స్ వేసుకోకూడదని ఆమె శరీరాక్రుతి, చుట్టూ ఉన్న మగవాళ్ళను   ప్రేరేపించకూడదని ఆంక్షలు విదించేవాడు. కాని ఆమె అతను తన ఉద్యోగానికి దూరంగా వెళ్ళినపుడు ఎల్లప్పుడు స్వేటర్స్ ధరించేది. తన శరీర అందాలు ప్రస్పుటంగా చూపరులకు కనిపించే దుస్తులు ధరించేది.
1945లో మోడల్ గా గంటకు 5 డాలర్లు సంపాదించేది. అది కూడా  ఛాయా చిత్రాలు పత్రికలు కొనుక్కుని ఫోటోగ్రాఫర్ కు డబ్బులు వచ్చినాకే! అప్పుడే నార్మా అందంగా నవ్వడం అతి ప్రయత్నం మీద సాచింది. తన తల వెంట్రుకలను బ్లీచ్ చేసుకుంది.

మోడలింగ్ లో విజయం సాదించి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. సినిమాలలో ప్రయత్నిచింది. 20th సెంచరీ ఫాక్ష్స తో సెప్టెంబర్ 1946 లో మొదటి ఒడంబడిక మీద తన సంతకం పెట్టింది.  జేమ్స్ డౌ హార్టీ కి విడాకులిచ్చింది. నార్మా మార్లిన్ మన్రో గా పేరు మార్చుకుంది. మన్రో ఆమె తల్లిగారి ఇంటిపేరు. అప్పటికే మార్లిన్ మిల్లర్ అనే నటినిచూసి మార్లిన్ అనే పేరు పెట్టుకుంది.

మార్లిన్ మొదటి సినిమా "స్కడ్డా హూ స్కడ్డా హే " 1948 లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో ఆమె చెప్పింది ఒకే డైలాగు "హి" అని. అది కూడా ఎడిటింగ్ లో కత్తెరకు గురైంది. కాని ఆమె ఒక సీనులో మాత్రం కనిపిస్తుంది.
మార్లిన్ కు రెండవ అవకాశం "డేంజరస్ ఇయర్స్" లో వెయిట్ రెస్ గా  క్లోజప్ లబించింది. అది ఎనిమిదవ సెప్టెంబర్ 1947 న విడుదలైంది. మొదట నటించిన సినిమాకంటే ముందే!

ఫాక్స్ కాంట్రాక్ట్ ముగిసింది ఆరునెలల తరువాత కొలంబియా పిక్చర్స్ వారు "బి" శ్రేణి సినిమా "లేడీస్ అఫ్ ద కోరస్ లో ఒక పెద్ద పాత్ర ఇచ్చారు. అది విడుదలైనాక ఆనాటి పత్రికలు మార్లిన్ కంటస్వరాన్ని  మెచ్చుకున్న కొలంబియా వారు. తమ కాంట్రాక్ట్ ను పొడిగించలేదు. మార్లిన్ తీవ్ర అసంత్రుప్త్తి కి గురైంది.

మల్లీ మోడలింగ్ వృత్తిలో లీనమైంది.కాని మార్క్స్ బ్రదర్ సినిమాలో "లవ్ హ్యాపీ" లో  ఒక సెక్సీ పాత్ర ఉందంటే ఆడిషన్ కు హాజరై ఎంపికయ్యింది. 90 క్షణాలు వెండితెరమీద కనిపించింది. ఆ తరువాత ఫాక్స్ కోసం కాంట్రాక్ట్ లేకుండా " ఎ టికెట్ టూ టొమా హాక్ " లో 1949లో ఒక కోరస్ లో నటించింది.

 మార్లిన్ హాలీవుడ్లో జానీ హైడ్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. వయసులో ఆమెకంటే పెద్దవాడైనా  ఆమె ప్రేమికుడిగా, ఆమెను సినిమాల కోసం బాగా తీర్చిదిద్దాడు.ఆమె ప్రతిభా సామర్ద్యాల మీద అచంచల విశ్వాసం అతనికుండేది. మార్లిన్ భవిష్యత్ లో చాలా గొప్ప స్టార్ అవుతుందని హైడ్ నమ్మకం. అయితే హైడ్ గుండే జబ్బుతో బాదపదేవాడు. తనను పెళ్లి చేసుకోమని మార్లిన్ ను నిరంతరం ప్రాదేయపడేవాడు. ఒక మిలియన్ డాలర్ ల ఆస్తి దక్కుతుందని ఆసపెట్టినా ప్రేమలేకుండా పెళ్లి చేసుకోడానికి మార్లిన్ ఇష్టపడలేదు. అప్పటికే ఒక సారి పెళ్లి చేసుకుని తప్పు చేసింది. హైడ్ గుండె జబ్బుతో పోయాడు. మార్లిన్ అతని కాపిన్ ను పట్టుకుని వలవల ఏడ్చి హిస్టీరికల్ గా మారింది. వారితో పాటు మార్లిన్ మొదటి పంక్తిలో కూర్చోవడానికి జానీ హైడ్ భార్య అనుమతించలేదు.
1949లో జానీ హైడ్ తన మృతికి ముందే జాన్ హూస్టన్ సినిమా "ది ఆస్ పల్ట్ జంగిల్"లో మార్లిన్ ని నెల జీతం పై  బుక్ చేయించాడు. దానిలోని నటనకు మంచి సమీక్షలు వచ్చాయి, ఆ పాత్ర చేసిందేవరూ అని ప్రేక్షకులు  వాకబు చేసారు. అయితే ఆ సినిమాలో  ఆమె పేరు తెరమీద క్రెడిట్స్ లో వేయటం మరిచిపోయారు!

1950 లో "ఆల్ అబౌట్ ఈవ్" లో ఒక చిన్న సీన్ కోసం ఆమే ఆమె రీటేక్ లు తీసుకుంది. అంతేకాక సెట్స్ కు ఒక గంట ఆలస్యంగా వచ్చింది. అప్పటి నుంచి ఆలస్యంగా సెట్స్ కు రావడం మార్లిన్ కు ఒక అలవాటుగా పరినవించింది.
1950 లో మార్లిన్ నటన గురించి పుస్తకాలు చదవడం స్నానం చేసే ఉడుపులతో కెమెరాలకు పోజులివ్వడం మొదలు పెట్టింది. బేతింగ్ సూట్లో  మార్లిన్ ఛాయా చిత్రాలు పత్రికల ముఖ పత్రాలను అలంకరించి ఆమెకు ఎనలేని పేరు ప్రఖ్యాతలను ఆర్జించి పెట్టాయి.

1951లో మార్లిన్ కు ఆస్కార్ అవార్డ్ అందజేసే అవకాశం లబించింది. ద్వనిముద్రనకు గానూ," ఆల్ అబౌట్ ఈవ్" చిత్రానికి గాను  తామస్ మౌల్టాన్ కు తన కరకమలముల ద్వారా అందించింది.
1951లో " లవ్ నెస్ట్ " లో కవ్వించి భర్తనుండి భార్యను విడదీసే పాత్ర చేసింది.  బేతింగ్ సూట్ వేసుకుని నటించింది. అవసరం ఉన్నా, అవసరం లేకున్నా ఆనాడు ఆమె చుట్టూ చేరడానికి అందరూ చూసేవారు. స్టూడియోలో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఒక కలకలం సృష్టించింది. అందుకే ఆ చిత్ర దర్శకుడు ఎవరూ ఆమే వద్దకు రాకూడదని ఆంక్ష విదించాడు.

"లెట్ హజ్ మేక్ ఇట్ లీగల్ " లో మార్లిన్ నటించింది. అయితే  ఆమెకు లభించినన్నీ బి గ్రేడ్ కామిడీ సినిమాలే ఆమెకు లబించిన పాత్రలు గుర్తించుకోతగ్గవి కాకున్నా ఆమె మాత్రం నలుగురి కళ్ళలో పడి ఒక బలమైన ఆకర్షణ గా నిలిచింది. "యాజ్ యంగ్ యాజ్ యూ ఫీల్" లో కూడా అంతే   చిన్న పాత్రే
1951 సంవత్సరపు మోస్ట్ ప్రామిసింగ్ పర్సనాలిటీ గా  మార్లిన్ కు " హెన్రి యేటా" అవార్డ్ లభించిది. హెన్రి యేటా అవార్డ్ స్వీకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న దుస్తులు ప్రకంపనాలు సృష్టించాయి. "షీప్ అండ్ వల్గర్ "  అని ఒక పత్రిక వ్యాఖానించింది. కాని  నాలుగువందల వార్తా పత్రికలు మార్లిన్ ఛాయా చిత్రాలను ప్రచురించి ఆమె అంటే ఒక పెద్ద  క్రేజ్ సృష్టించాయి. 1951లోనే " క్లాస్ బై నైట్ " సినిమాలో ఆమెకు మంచి పాత్ర లభించింది. వేరే పాత్ర దారులు అసూయ పడేటంతగా ఫోటో గ్రాఫర్స్  ఆమే వెంట పడి పోటీ పడి మరీ ఫోటోలు తీయడానికి ఎగబడేవారు
"మెర్లిన్ ఈ దఫా" నటన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పరిపూర్ణత్వం సాదించడానికి ప్రయత్నించింది. తన నటనను సరిదిద్దడానికి ఒక కోచ్ ను నియమించుకుంది. ఆమే ప్రయత్నాలు ఫలించి ఆ సినిమాకు సినిమా సమీక్షకుల నుంచి మంచి రివ్యూ లు లభించాయి.

1951లో ఆమే ప్రముఖ తారత్వం " major stardom"అందుకుంది పత్రికలు ఆమె ముఖం ముఖ చిత్రంగా వారాల తరబడి అలంకరించుకున్నాయి. కొత్త పోజులు దొరక్క పోతే పాట ఛాయా చిత్రాలను మళ్ళీ మళ్ళీ పునః పునః మార్లిన్ బొమ్మలనే వేసి వేసి చదువరుల్లో ఒక పెద్ద క్రేజ్ పెంచారు. 1952 ఏప్రిల్ లో లైఫ్ పత్రిక సెక్సీ మార్లిన్ ని తన ముఖ చిత్రంగా అలంకరించుకుంది. ఆమె సెక్స్ అప్పీల్ లో ఉన్నతోన్నత శిఖరాలను   అధిరోహించింది.పురుషుల్లోని కోరికకు ఒక పెను సవాల్ గా నిలిచింది.తన హావ భావ విళాసాలతో ప్రతి కెమెరానూ కవ్వించింది. కాని ఎక్కడో అంతరాంతరాలలో తానూ అంత అందమైన దానిని కాదనే ఆత్మన్యూనతాభావం  ఆమెను క్రుంగదీసేది.

ఫాక్స్ కు "డోంట్ బాదర్ టూ నాక్ " చిత్రంలో  సైకోటిక్ బేబీ సీటర్ గా ఆమె నటించింది.1952 తొలిరోజుల్లో విడుదలవుతున్నప్పుడు ఆమెపూర్తి నగ్న ఛాయాచిత్రాలు పత్రికలలో ప్రచురితమై సంచలనాలు రేకెత్తించాయి." అయిదేళ్ళ క్రితం డబ్బు అత్యవసరంగా కావాల్సిన దుర్భర పరిస్తితుల్లో తప్పనిసరై దిగంభరంగా పోజులివ్వవలసి వచ్చిందని తన తప్ప్పు ఒప్పుకుంది, కొంత సానుభూతి సంపాదించింది. ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు  లైఫ్ పత్రిక మార్లిన్ ను అమెరికాలో "అత్యదికంగా చర్చించబడుతున్న నటి"గా  పేర్కొంది. అయితే ఆ సినిమాలో ఆమె నటన విమర్శకు గురై సినిమా అనుకున్నట్లుగా పెద్ద హిట్ కాలేదు. అది డబ్బు చేసున్నంత మేరా మార్లిన్ విక్యాతి వల్లే చేసుకుందని విమర్శకులు  ఆపాదించారు. బేస్ బాల్ అజరామరుడు జోడీ మాజియో తో మార్లిన్ డేటింగ్ చేస్తున్నదని ఆనాటి పత్రికలన్నీ   కోల్లై కూచాయి. ఆటను ఎప్పుడూ రిజర్వుడుగా మితభాసిగా ప్రతిదానికి సిగ్గు పడుతూ ఎక్కడా జోకులు కూడా వేయకుండా ఉండేవాడని  తన ముందున్న ఆహారాన్ని కూడా  బుజించకుండా  తననే చూస్తూ, తననే చూపులతో తినేసావాడనీ, అందుకే తానూ జో సాన్నిహిత్యమంటే ఇష్టపడేదాన్నని మార్లిన్ పేర్కుంది.

మే 6 1952 న మన్రో కు ఆపరేషన్ జరిగి ఎపెండిక్స్ తొలగించారు. తొందరగా నయమై ఆమె కోలుకోవాలని అభిమానులు వేనవేల గ్రీటింగ్స్ తో ఆమెను ముంచెత్తారు. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ లు ఆమె కడుపుకు టేప్ తో అతికించి ఉన్న సందేశాన్ని ఇలా చదువుకున్నారు!!"దయచేసి మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే తీసుకోండి దయచేసి శరీరం మీద మచ్చలను (scars) శరీరం మీద మిగల్చకండి". మార్లిన్ మరో మందు గుండు పేల్చింది. తానూ అనాధగా బ్రతికానని తన తల్లి గాడిస్ బేకర్ ఇంకా బ్రతికే ఉన్నదని, ఒకప్పుడు పిచ్చాసుపత్రిలో చేరిందని తన తల్లితో తనకు అంతగా సాన్నిహిత్యం లేదని అయినా ఇప్పుడు తాను తన తల్లికి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నందున ఆమెను సంప్రదించానని పేర్కొంది. దినపత్రికలలో అది ఒక సంచలన జాతీయ వార్త అయ్యింది. అందరూ ఆచర్యంతో ముక్కుల మీద వేల్లెసుకున్నారు. 1952 జూన్ 25 న మార్లిన్ కోర్టుకు హాజరై తన పోర్నోగ్రాఫిక్ చాయాచిత్రాలను కొనమని తానెవరికీ లేఖలు పంపలేదని, ఒక క్యాలెండర్ కోసంనగ్నంగా ఒకసారి తప్ప తానెప్పుడూ సెక్సీ పోజులు ఇవ్వలేదని ఆ ఫోటోలు, లేఖలూ నకిలీవే అని సాక్ష్యమిచ్చింది. ఆ నకిలీ ఫోటోలను సృష్టించిన ఇరువురు వ్యక్తులకు శిక్షపడింది.

1953లో "నయాగరా" సినిమాలో భర్త కళ్ళుకప్పే భార్య  రోజ్ లూమిస్ గా ఆమే నటించింది.నయాగరా పెద్ద సూపర్ హిట్టై  ఆరోజుల్లోనే ఆరు మిలియన్ల డాలర్లు వసూలు చేసింది." నయాగరాను విజయవంతం చేసింది మార్లిన్ మన్రో యేనని టైం పత్రిక ఆమెకు కితాబు ఇచ్చింది.
మార్లిన్ మన్రో తన " మన్రోఇజం " కి చాలా పేరెన్నిక కన్నది. మొదట అందరూ ఇది ఆమె ప్రిసేజేంట్ ను కృత్రిమంగా సృష్టించిన కలకలమనుకున్నారు కానీ, ఆనక అది నిజమని నిరూపితమైనది. మన్రో ఒక ద్రుగ్విషయంగా" phenomenon"  గా పరిణమించింది.

ఆమె  న్యూయార్క్ వెళ్ళినపుడు ఒక విలేకరి అడిగిన ప్రశ్న" మీరు లోదుస్తులు "under wear" ఎందుకు ధరించరు?" దానికి మార్లిన్ ఇచ్చిన సమాధానం ముడతలు అనుభూతించకుండా ఉండటానికి " (i don't like to feel rinkils)
1953మార్చిలో రెడ్ బుక్ అవార్డ్ జస్ట్ యంగ్ బాక్స్ ఆఫీస్ పర్సనాలిటీ కి గాను ఆమెకు లబించింది . అప్పటికే ఆమె వారం వారం 25 వేల అభిమానుల ఉత్తరాలు అందుకునే స్థాయికి చేరుకుంది.
1953లో జంటిల్ మాన్ ప్రిఫర్ బ్లాన్డేజ్ చాలా ఖరీదైన సంగీతాత్మక చిత్రం అది అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ అయ్యింది. అప్పటికే మార్లిన్ నెంబర్వన్  మూవీ గ్లామర్ గర్ల్, నెంబర్ వన్ కవర్ గర్ల్ ద ఇయర్ అంతే కాదు ఆమె ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టీ ఆమే పైనే వాలేది. హాలివుడ్ కు  "మన్రో మానియా" చుట్టుకుంది.
మార్చి 1953లో మార్లిన్ "ఫాస్టెస్ట్ రైజింగ్ స్టార్ ఆఫ్ 1952" ఫోటో ప్లే అవార్డు  ఆనందోస్తాహాలతో అందుకుంది.

అయితే  చవకయిన, అవకతవకయిన పరమ అసబ్య దుస్తులు ధరించిదని విమర్శుకుల తుఫాను ఎదుర్కుంది. మార్లిన్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతూ, అడ్డదారితొక్కుతూ ఇచ్చవచ్చిన దుస్తులు ధరించి కులుకుతున్నదని విమర్శలు అప్పటికే వెల్లువెత్తాయి.

1953లో " హౌ టూ మేరీ ఎ మిలియనీర్" అనే సినిమా సినిమా స్కోప్ లో మార్లిన్ తో తీసారు సినిమా స్కోప్ అంతకు ముందు " ది రోబ్ " బైబిల్ కధతో తీసినప్పుడు మాత్రమే హాలివుడ్లో ఉపయోగించారు. అనగా ఇది స్కోప్ ఉపయోగించిన రెండవ సినిమా అన్నమాట. మెర్లిన్ ధరించిన పాత్రకు మంచిపేరు వచ్చింది. మొదట ఆ పాత్రకోసం గాని, కళ్ళజోడు ధరించడానికి ఊగిసలాడినా ఆనక ఆ సినిమా రచయిత,నిర్మాత  ఆమెను ఒప్పించగలిగాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర అది అపూర్వ విజయం సాధించింది.ప్రీమియర్ షోలో   మార్లినే ఆకర్షక కేంద్రంగా నిలిచిందని వేరే చెప్పనవసరం లేదు.

1953లో గ్రౌమన్స్ చైనీస్ ధియేటర్ హాలివుడ్ లో సిమెంట్ పై ఆమె హస్తముద్రలు సంతకం సేకరించాయి. అది తిరుగులేని విజయసాదనకు ప్రతీక. అపుడు మార్లిన్ కు 20 ఏళ్ళు మాత్రమే. తన తల్లితో వచ్చి తారల హస్తముద్రలూ సంతకాలు చూడటానికి  వచ్చిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని మురిసిపోయేది.
రివరాఫ్ నో రిటర్న్ సినిమాలో మార్లిన్ పాత్ర చిత్రణ రూపకల్పన సరిగా జరగలేదు. రచనలో పరిణతి కనిపించలేదు  ఆమె ధరించిన దుస్తలు వెకిలిగా ఉన్నా , ఆ సినిమా విజయవంతం కాకపోయినా  మార్లిన్ కి నష్టమేమీ జరగలేదు.   ఆమె గ్లామర్స్ ఇమేజ్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

మార్లిన్ అందమైనది, ప్రఖ్యాతమైనది, గ్లామర్ తో మిసమిసలాడుతున్నది. ఎందరి ప్రేమనో చూరగొన్నది, అయినప్పటికీ అత్యంత పేరు తెచ్చుకోవడం వల్ల కానరాని శత్రువులు కూడా అకారణంగా తయారయ్యారు. ఎందరో అసూయ గ్రస్తులు ఆమె మీద అబాండాల మీద అభాండాలు ఉట్టి పుణ్యానికే ప్రచారం చేయసాగారు. కీర్తితో పాటు దాని పక్క పొదలోనే అసూయకూడా పొంచి ఉంటుందేమో!

బేస్ బాల్ దృగ్విశయమ్ (phenaminon)   జో డియో జియో తో మార్లిన్ వివాహం 14 జనవరి 1954 (మన సంక్రాతి రోజున) సాంఫ్రాన్సిస్ కొ లో  రంగరంగ వైభోగంగా జరిగింది. ఈ వార్తతో అమెరికా అంతా దద్దరిల్లి పోయింది. " ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాము" అని మార్లిన్ ప్రకటించింది. తేనె చంద్ర ధర్శనం కోసం(honey moon trip)  జపాన్ ను ఆ నవజంట ధర్శిన్శింది. ఎటు పోతే అటు జనతహ జేజేలు పలికింది.

నిమోనియా సోకింది మార్లిన్ కి. ఆమె భర్త 'జో' విలేకర్లతో ఆమె ఇంటర్వ్యూ లను అడ్డుకున్నాడు.
రెండు వారాల తరువాత మార్లిన్ బాగా కోలుకుంది. 1954 మార్చిలో ఫోటో ప్లే అవార్డ్ ను రెండవసారి అందుకుంది. ఈ సారి జెంటిల్ మెన్ ప్రిఫర్ బ్లాండీస్ మరియు " హొ టూ మేరీ ఎ మిలియనీర్ " చిత్రాలలో నటనకు గాను, ఉత్తమ నటీమణిగా అవార్డును అందుకోవడం ఆమెను ఉత్స్తాహంతో ముంచెత్తింది.
1954 లో " దేరీజ్ నో బిజినెస్ లైక్ షో బిజినెస్ " లో నటించింది.

ఫాక్స్ కోసం సెప్టెంబర్ 1954 లో " ద సెవన్ ఇయర్ ఇచ్ " ఆమె నటించింది. " బిల్లీ వైల్డర్ నాటికను చలన చిత్రీకరించారు. ఏ పాత్ర హాస్యపూరకమైన మహిళా నాయిక. ఆ ఆఫర్ ను సంతోసంగా అంఘీకరించింది. 15 సెప్టెంబర్ 1954 నా 2000 వేల మంది చూపరులూ, విలేఖరులూ. ఛాయాచిత్రాకారులు మిటమిట చూస్తుండగా  పెద్ద ఎలక్ట్రిక్ ఫ్యాన్ పెట్టి మార్లిన్ కట్టుకున్న స్కర్ట్ గాలికి పైకెగిరే దృశ్యం చిత్రీకరించారు. అది దగ్గరుండి చూసిన ఆమె భర్త 'జో' ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క రాలదు! కాలిపోర్నియాకు తెరిగొచ్చాక వారి పెళ్లి పెడాకులైనట్లేననే వార్త పత్రికలలో గుప్పుమంది.

5  అక్టోబర్ 1954 న నవమాసాల లోపునే 'జో' తో పెళ్లి వికటించింది.మార్లిన్ కు 'జో'కు  ఏవిదంగానూ పోసగలేదు. విలేకర్లు గుచ్చి గుచ్చి ప్రశ్నలడిగినా మార్లిన్ నేను అందుకు "విచారిస్తున్నాను" అని మాత్రమే జవాబు చెప్పింది! ఆరోజే ద సెవన్ ఇయర్ ఇచ్ షూటింగ్ ఉంటే దానిని కేన్సిల్ చేసి మార్లిన్ ను ఇంటికి పంపారు. ధర్శక రచయిత అన్నాడు "అది కామెడీ పాత్ర ఈ రోజు ఆమె జీవితంలో ఎక్కువ కామెడీని చూడలేదని" పేర్కొన్నాడు!

మూడు వారాల తర్వాత  విడాకులపత్రం పై ఆమె సంతకం చేసింది. 'జో' సినిమాలు మానేయమని మార్లిన్ కు హితం చెప్పి తన భార్యగా మాత్రమే కొనసాగాలన్నాడు. అది ఆమె చేయలేక పోయింది. మార్లిన్  మాటల్లో 'జో' "నాతో మాట్లాడటం లేదు. ఒక మనిషిగా,కళాకారిణిగా, నన్ను పూర్తిగా ఉపేక్షిస్తున్నాడు. నాకు స్వంతంగా స్నేహితులు ఉండకూడదంటున్నాడు. నా పని నన్ను చేయనివ్వటం లేదు. నాతో ఒక ముద్దూ ముచ్చట లేకుండా టెలివిజన్ కు  అతుక్కుపోతున్నాడు. 'జో' హాలీవుడ్ లో అందర్నీ డిస్టర్బ్ చేశాడు.  మేమిరువురం విభిన్న లోకాల్లో నివసించాం. రోజంతా టీవీ ముందు గడిపేస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక ఆట కళ్ళార్పకుండా చూస్తూ! కొన్ని రోజుల తరబడి నాతో ససేమిరా మాట్లాడేవాడు కాదు. ఇలాంటి మూడీ వ్యక్తిని నా జీవితంలో నేను ఇంతవరకూ కలవలేదు".

నవంబర్ 1954 లో మార్లిన్ కు చిన్న చస్త్ర చికిత్స కరిగింది. అక్కడికీ కెమెరాలు పట్టుకుని వేలేఖర్లు తయారయ్యారు. తనకు కీర్తి ఎక్కువై  ఏకాంతమే కరువైందని మార్లిన్ వాపోయింది. విలేఖర్లతో ఆమెకు మొహం మొత్తింది.
7 జనవరి 1955 రోజున న్యూయార్క్ లో విలేఖర్ల సమావేశం ఫోటో గ్రాఫర్ మిల్టన్ గ్రీన్ తో కలిసి ఏర్పరచి ఇలా అంది "సెక్స్ పాత్రలతో నేను విసిగెత్తిపోయాను. మంచి నాటకీయత ఉన్న పాత్రలకోసం మొహం వాచీ ఉన్నాను. ఎక్కువ సినిమాలలో చేయడం కూడా నా అభిమతం కాదు. అదే రకమైన పాత్రలు పదేపదే వేయలేను. ఒక వ్యక్తిగా, ఒక నటిగా నేను ఎదగాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ లో  నా అభిప్రాయం ఎవరూ అడగరు. వాళ్ళు ఇచ్చినపాత్ర నేను వేయాలి. నేనే స్వంతగా మిల్టన్ తో కలిసి మార్లిన్ మన్రో ప్రొడక్షన్స్  అనే సినిమా నిర్మాణ సంస్థను ప్రారంబిస్తున్నాను" అని ప్రకటించింది.

1 జూన్ 1955న మార్లిన్ 29 వ జన్మదినం రోజున తన మాజీ భర్త 'జో' డిమా జియో వెంటరాగా దసెవన్ ఇయర్ ఇచ్ " ప్రీమియర్ షోకి హాజరయ్యింది.విలేఖర్లు ఆచర్యపోతే "జస్ట్ అలా కలిశాం అంతా కంటే వేరే విశేషమేమీ లేదు".  అని మార్లిన్ వాటికి సమాధానం ఇచ్చింది.

ద సెవన్ ఇయర్ ఇచ్ లో మార్లిన్ ధరించిన పాత్రకు మంచి పేరొచ్చింది.అరుధైన అపురూప హావభావాలను మార్లిన్ ప్రధర్శించిందని పత్రికలు వేనోళ్ల పొగిడాయి. ఆమె మంచి నటనకు నీరాజనాలు లభించడం ప్రారంభమైంది. ఆమె న్యూయార్ కు మారి లీ స్ట్రాస్ బెల్ యాక్టర్స్ స్టూడియోలో నటనని ఆద్యాయనం చేయడం ప్రారంభించిది.
"డెత్ ఆఫ్ ఆ సేల్స్ మెన్ " నాటక రచయిత పులిజ్జర్ బహుమతి గ్రహీత ఆర్థర్ మిల్లర్ తో మార్లిన్ రహస్యంగా  ప్రేమాయణం సాగిస్తున్నదని గుసగుసలు ప్రారంభమయ్యాయి.

1956 ఫెబ్రవరిలో న్యూయార్క్ పత్రికా విలేఖరుల సమావేశం లో మార్లిన్ మన్రో ప్రొడక్షన్స్ " ద స్లీపింగ్ ప్రిన్స్"లో మార్లిన్ మన్రో మరియూ లారెన్స్ ఒలివియర్ నటిస్తారని తెలియజేశారు.లారెన్స్ ఒలివియర్ కంటే మార్లిన్ మన్రో యే ఫోకస్ లో నిలిచింది.అప్పుడే ఆమె బుజపు స్త్రేప్ తెగిపోయింది!

యాక్టర్స్ స్టూడియో లో స్ట్రాస్ బర్గ్ అతని భార్య పౌలా మార్లిన్ నటనను తీర్చిదిద్దారు. వారు ఇరువురు ఆమెకు చాలా సన్నిహితులయ్యారు. ఆమె మృతిదాకా వారి మైత్రి అలాగే కోన సాగింది. ఆమె నటించిన 5 సినిమాలలోనూ నాలుగు సినిమాలలో అద్భుతమైన నటన ప్రధర్శించడానికి, మార్లిన్ ఆత్మ విశ్వాసం పెరగడానికి వారి శిక్షణ తోడ్పడింది.
1956 ఫిబ్రవరిలో 20th సెంచరీ ఫాక్స్ తో తన అభిప్రాయాబేదాలను తొలగించుకుని బస్ స్టాప్ అనే సినిమాలో చెర్రీ పాత్ర ధరించడానికి ఆమె అంఘీకరించింది, ధర్శకుడు జాషువా లోగన్ అందులోని మార్లిన్ నటనను మెచ్చుకుని తనను ఆకాశంలోకి ఎత్తేశాడు.బస్ స్టాప్ విడుదలయ్యాక కళాకారిణిగా మార్లిన్ కు మంచి పేరు వచ్చింది. యాక్టర్స్ స్టూడియోలో నేర్చుకున్న నటన ఆమెకు బాగా ఉపకరించింది. ఆనాటి ప్రముఖ పత్రికలన్నీ ఆమెకు బ్రహ్మ రధంపట్టాయి కానీ హాలీవుడ్ మాత్రం మార్లిన్ ను గొప్పనటిగా ఎంత మాత్రమూ అంగీకరించలేదు. ఆమెకు ఆస్కార్ భాహుమతి ఇవ్వాల్సిందేనని పరిశీలకులు అన్నప్పటికీ  ఆమె కనీసం నామినేషన్ కూడా సంపాదించలేక పోయింది. చనిపోయేదాకా కూడా మార్లిన్ ఆ విషయం లో అసంతృప్తి తోనే భాదపడింది.

21 జూన్ 1956 రోజున ప్రముఖ నాటక రచయిత ఆర్థర్ మిల్లర్ ణు వివాహమాడబోతున్నట్టు  పత్రికా విలేకర్ల సమావేశంలో మార్లిన్ ప్రకటించింది.1 జూలై 1956 రోజున జ్యూ అయిన ఆర్థర్ మిల్లర్ ణు నిజంగానే పెళ్లి చేసుకుంది. "ఆర్థర్ ఎప్పుడూ సీరియస్ గ కనిపిస్తాడు. కాని ఆయనలో  అద్భుతమైన హాస్య ప్రవృత్తి ఉంది.  నేను ఈ సారి నిజంగానే ప్రేమలో పడ్డాను. మేము చాలా విషయాలలో జోక్స్ వేసుకొని మనసారా నవ్వుకుంటాము. నాకు ఆయనంటే పిచ్చి" అంది మార్లిన్. ఈ పెళ్ళివల్ల తానెంతో వాంచించిన గౌరవం పెరిగిందని ఆమె భావించింది. అంత గొప్ప మేధావి తనను పెళ్లి చేసుకోవడానికి తానూ కూడా తెలివైనది కావడమే కారణమని ఆమె నమ్మింది.
 "ది  స్లీపింగ్ ప్రిన్స్ "కు కొత్త పేరు"ది ప్రిన్స్ అండ్ షో గర్ల్ " అని పెట్టారు. మార్లిన్ షూటింగ్ సంధర్భంలో అనారోగ్యానికి గురికావడం, సంభాసనలు మర్చిపోవడం అందరినీ భాదించాయి. సర్ లారెన్స్ ఒలివర్ దర్శకత్వం లో నాటకీయత  శ్రుతిమించిందని ఆమె భావించింది.దర్శకుడు ఒక సంధర్భంలో " ఓకే మార్లిన్ బీ సెక్సీ" అని విసుక్కోగా ఆమె " మిస్టర్ సర్ " అని సర్కాజం ప్రదర్శించింది! దర్శకుడికి, ప్రధాన నటికి మధ్య సరియైన సయోధ్య లోపించింది. అయినప్పటికీ  ఆ సినిమాలో ఆమే ప్రదర్శించిన నటన విమర్శకుల ప్రసంశలు పొందింది. అయినప్పటికీ ఆమెకు ఆస్కార్ నామినేషన్ ఈ సారి కూడా దక్కలేదని నిరాశ చెందింది.

1 ఆగస్ట్ 1957 రోజున ఆమెకు మొదటి సారి గర్భస్రావం జరిగింది. ఆనక మరో రెండుసార్లు కూడా బిడ్డ దక్కలేదు. భర్త ఆర్థర్ మిల్లర్ ప్రతిసారి ఆమెకు అండగా నిలిచాడు. పిల్లలకు జన్మనివ్వలేని గొడ్రాలితనం ఆమెను జీత అంతం వరకూ వెంటాడింది.   శిశు సంక్షేమం కోసం మార్లిన్ తన ఆదాయం లో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చి అందరికీ ముందు నిలిచింది. అనంతరం " సమ్ లైక్ ఇట్ హాట్ లో ఆమె నటించింది. మార్లిన్ తో  రెండవ సినిమా చేయడానికి అంఘీకరించిన మొదటి దర్శకుడు బిల్లీ వైల్డర్. అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా. మార్లిన్ అందుకు విభేదించినా  వైల్డర్ ఆ కథ నలుపు తెలుపులోనే తీయడం అవసరమని ఆమెను ఒప్పించాడు.

"ది సెవన్ ఇయర్ ఇచ్ " లో దర్శకుడు బిల్లీ వైల్డర్ ఎంతో సహకరించిన మార్లిన్ " సమ్ లైక్ ఇట్ హాట్" లో సమయానికి రాక  వచ్చినా సంభాషణలు గుర్తుంచుకోక  రీటేక్ ల మీద రీటేక్ లు తిని  un profissional  వ్యవహరించి దర్శకుడిని ఖంగు తినిపించింది. షూటింగ్ సందర్భం లో మరో సారి మార్లిన్ కు గర్భ స్రావం జరిగింది.
18  shooting days  మార్లిన్ వల్ల వృధా అయినాయని, లెక్కలేనన్ని డాలర్ల ఆమె వల్ల వృధా జరిగినాయని  ఎన్నో తలనొప్పులు,  heart aches   తెప్పించిందని వైల్దర్ వాపోయాడు!
మార్చ్ 1959 లో మార్లిన్ కి ఆస్కార్ తో సమానమైన ఇంచ్ పురస్కారం " ది ప్రిన్స్ అండ్ షో గర్ల్ " లోని నటన కోసం గానూ లభించింది.

"సమ్ లైక్ ఇట్ హాట్ " అతిపెద్ద బాక్సాఫీస్ హిట్ అయ్యింది. ఆమె నటనకు ఎన్నెన్నో ప్రసంశలు లభించాయి. ఆమే అమెరికా యొక్క అతిమంచి హాస్యపాత్ర దారినిగా అభినందనలు అందుకుంది.
" ప్రిన్స్ అండ్ ది షో గర్ల్" లోని  ఆమె నటనకుగాను  మార్లిన్ ఆస్కార్తో సమానమైన ఇటలీ "డేవిడ్ డి డోనటెల్లో భహుమతి అత్యుత్తమ విదేశీ నటిగా 1958 లో బహుమతి అందుకుంది.
1960 లో ఆమే నటించిన  సమ్ లైక్ ఇట్ హాట్ కు గానూ మన్రో బెస్ట్ ఆక్టర్స్ ఇన్ కామెడీ గా  8 మార్చ్ 1960 రోజున హాయ్ అందుకుంది. కాని ఆమెకు ఈసారి  కూడా ఆస్కార్ నామినేషన్ దక్కలేదు, నిరాశ తప్పలేదు.20th సెంచరీ  ఫాక్స్ వారి " లెట్ అజ్ మేక్ లవ్" లో  మన్రో నటించించడానికి  అంగీకరించింది. కాని ఎందుకో తెలీదు చాలా బయం బయం గా నటించింది అందుకే  ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

ఆర్థర్ మిల్లర్ తో మన్రో కు అభిప్రాయ బేధాలు పొడచూపాయి. ఆమే మానసిక సంతులనాన్ని అతను సరిచేయలేఖ పోయాడు YVES Montand  అనే సహా నటుడి మోజులో ఆమె పడిపోయింది.  అతనన్నాడు మన్రో " ప్రపంచ ప్రసిద్ది పొందిన పూర్తిగా ఒక శిశు మనస్తత్వం కలిగివుందని!" Niss fits   అనే సినిమాను జూలై 1960 లో ప్రారంభించారు. ఆర్థర్ మిల్లర్ దీనిని ఆమెకోసం ప్రత్యేకంగా రాసాడు.జాన్ హాస్టన్ దర్శకత్వం వహించాడు.ఆమె జీవితానికి సన్నిహితంగా ఉన్న పాత్రను చిత్రించాడు.

 ఈ సందర్భం లోనే  Vyes montand  ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. విపరీతంగా తాగడమే కాక  మాదక ద్రవ్యాలకు కూడా ఆమే అలవాటు పడిపోయింది. రాత్రి నిద్రపట్టదానికి ఎన్నో రకాల  నిద్ర మాత్రలు వాడవలసి వచ్చేది. అది ఆమెను క్రుంగదీసి బాగా దెబ్బతీసింది.
ఆర్థర్ మిల్లర్ ఆమె మాటలు లేని స్థితికి చేరుకున్నారు.హీరో క్లార్క్ గేబుల్ ఆమె unprofissionalisim   ను విమర్శించాడు. కొన్ని సందర్భాలలో లంచ్ టైం దాకా ఆమె షూటింగ్ కు రాకపోయేదని, టేకుల మీద టేకులు తినేదని విమర్శించాడు.

11 నవంబర్ 1960 రోజున ఆర్థర్ మిల్లర్ తో విడాకులు తీసుకుంటునట్లు ఆమె ప్రకటించింది.
" ది మిస్ పిట్స్" 31 జనవరి 1961 రోజున  విడుదలైంది. ఆమె నటన విమర్శకుల మన్ననలందుకున్నా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక పోయింది.
1961 మార్చ్ లో డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కు బానిశగా మారిన మన్రోను "  columbia presbiterian medical center  లో ఆమెను ట్రీట్మెంట్ నిమిత్తం చేర్చారు. తన కుటుంభ నేపద్యాన్నానుసరించి తనకు కూడా పిచ్చెక్కుతుందేమోనని ఆమే చాలా భయపడింది.
20 జూన్ 1961 రోజున న్యూయార్క్ పాలీ క్లినిక్ హాస్పిటల్ లో చేర్చి  ఆపరేషన్ చేసి ఆమె బ్లేడర్ ణు తొలగించారు.

కాలిపోర్నియాలో రెస్ట్ తీసుకుంటున్న మన్రో 1961 లో చాలా తక్కువ సార్లు పబ్లిక్ అపియరెంసస్ లో పాల్గొన్నది. ఒక శిశువుని దత్తత తీసుకోవాలని మెక్సికోలోని  ఒక అనాదాశ్రయానికి ఆమె వెళ్ళింది.దత్తతైతే తీసుకోలేదుగాని అనాధ పిల్లల భోజన సౌకర్యం కలిగించడానికి వెయ్యి డాలర్లు విరాళమిచ్చింది. ఆ సందర్భం లో " బ్రేక్ఫాస్ట్ లేకుండా బతకడం ఎలాంటిదో నాకు అనభవ పూర్వకంగా బాగా తెలుసు" అంది.

20th సెంచరీ ఫాక్స్ వారి " సంతింగ్' జ్ గాట్ టూ గివ్ లో ఆమే బుక్ అయ్యింది గాని, సెట్ లోకి సరిగా రాకపోవడం వల్ల ఆమెను వారు   తొలగించారనే  గుస గుసలు చెలరేగాయి, తొలగించారు కూడా! 19 మే 1962 రోజున న్యూయార్క్ లోని మేడిషణ్ స్వ్కేర్ లో అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ నలభై  అయిదవ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొని హ్యాపీ భర్త్  డే పాడింది. ఆ  పాట విన్నాక, అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ అన్నాడు " ఇంత మధురంగా మార్లిన్ మన్రో హ్యాపీ భర్త్ డే ఆలపించాక ఇక నేను రాజకీయాల నుంచి విరమించవచ్చునని!".
1 జూన్ 1962 రోజున ఆమే మృతికి ముందు ఆమె చివరి భర్త్ డే రోజున   ఫాక్స్ ఆమెపై కోర్టులో ధావా వేసింది. తానూ అనారోగ్యంగా ఉండటం వల్ల సరిగ్గా నటించలేక పోయానని మన్రో తన తప్పు ఒప్పుకుంది.(నటి యంత్రం కాదు, ఏను చాలా సిగ్గరిని అంది)  తన సహనటులు  vyes Montand తో, కెన్నడీ లతో ఆమెకు సెక్స్ సంభందాలు ఉన్నాయని ఆనాటి పత్రికలు చెవులు కొరుకున్నాయి.

నిద్రమాత్రలు అధిక మోతాదులో సేవించడం వల్ల మార్లిన్ మన్రో 5 ఆగస్ట్ 1962 రోజున మృతిచెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు హృదయపూర్వక నివాళులు అర్పించారు.

Monday, June 24, 2013